Kodela siva prasad: కోడెల భౌతికకాయానికి శవపరీక్ష పూర్తి

  • ఉస్మానియా ఆసుపత్రిలో నిర్వహించిన శవపరీక్ష
  • రెండు గంటల పాటు శవపరీక్ష నిర్వహించిన వైద్యులు
  • హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు భౌతికకాయం తరలింపు?

కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి శవపరీక్ష పూర్తయింది. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో కోడెల భౌతిక కాయానికి దాదాపు రెండు గంటల పాటు నలుగురు వైద్యులు శవపరీక్ష నిర్వహించారు. భౌతికకాయానికి ఎంబామింగ్ చేశారు. కోడెల మృతి చెందడానికి ముందు కాఫీ, టిఫిన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. కోడెల పోస్ట్ మార్టమ్ ప్రక్రియను పోలీసులు వీడియో తీసినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, ఈ రాత్రికి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లోనే కోడెల భౌతికకాయాన్ని ఉంచుతారు. రేపు ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి గుంటూరులోని పార్టీ కార్యాలయానికి తరలించనున్నట్టు తెలుస్తోంది. రేపు సాయంత్రం నరసరావుపేటకు కోడెల భౌతికకాయాన్ని తరలిస్తారని, ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహిస్తారని టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Kodela siva prasad
Telugudesam
post-martem
  • Loading...

More Telugu News