Kodela: కోడెల మరణం తర్వాత పరిస్థితులు క్షణక్షణానికి మారుతున్నాయి: బొత్స

  • కోడెల మృతిపై స్పందించిన బొత్స
  • కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
  • తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలన్న బొత్స
  • కోడెలపై తమ సర్కారు కేసులేమీ పెట్టలేదని వెల్లడి

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణంపై వ్యాఖ్యానించారు. కోడెల మృతి పట్ల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోడెల మరణం తర్వాత పరిస్థితులు క్షణక్షణం మారుతున్నాయని అన్నారు. కోడెల మృతిపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. పూర్తిస్థాయి విచారణ ద్వారానే వాస్తవాలు తెలుస్తాయని బొత్స అన్నారు. తమ ప్రభుత్వం కోడెలపై కేసులేమీ పెట్టలేదని బొత్స స్పష్టం చేశారు.

Kodela
Botsa Satyanarayana
Andhra Pradesh
Telangana
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News