Kodela siva prasad: నా తండ్రి మృతిపై ఎటువంటి అనుమానాలు లేవు: కోడెల కుమార్తె విజయలక్ష్మి

  • విజయలక్ష్మి స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు
  • నా తండ్రి చాలా ఒత్తిడిలో ఉన్నారు
  • గన్ మ్యాన్, డ్రైవర్ సాయంతో ఆయనను ఆసుపత్రికి తరలించాం

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై ఆయన కుమార్తె విజయలక్ష్మి చెప్పిన స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. తన తండ్రి చాలా ఒత్తిడిలో ఉన్నారని, తన తండ్రి మృతిపై తమకు ఎటువంటి అనుమానాలు లేవని ఆమె చెప్పినట్టు సమాచారం.

ఈరోజు ఉదయం తమ ఇంట్లో కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ కు కోడెల వెళ్లారని, అరగంట సమయం దాటినా ఆయన కిందకు రాకపోయేసరికి తనకు అనుమానం వచ్చిందని, పైకి వెళ్లి చూసే సరికి తన తండ్రి ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని తాను గమనించినట్టు చెప్పారు. గన్ మ్యాన్, డ్రైవర్ సాయంతో తన తండ్రిని ఆసుపత్రికి తరలించామని ఆ స్టేట్ మెంట్ లో విజయలక్ష్మి పేర్కొన్నట్టు సమాచారం.

Kodela siva prasad
Vijayalakshmi
Daughter
  • Loading...

More Telugu News