YSR: వైఎస్ కంటే జగన్ సర్కారే ఎక్కువగా వేధిస్తోందని కోడెల ఆవేదన చెందారు: నక్కా ఆనంద్ బాబు

  • కోడెల మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన నక్కా
  • వైసీపీ సర్కారు వేధింపుల వల్లే కోడెల మరణించాడని ఆగ్రహం
  • ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ వ్యాఖ్యలు

మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ సహచరుడు కోడెల శివప్రసాదరావు మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల మృతి చెందాడని నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. కోడెల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. వైఎస్ కంటే ఎక్కువగా జగన్ ప్రభుత్వం వేధిస్తోందని కోడెల ఆవేదన చెందారని నక్కా ఆనంద్ బాబు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో కోడెలది ప్రత్యేక స్థానం అని, ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు.

YSR
YSRCP
Jagan
Nakka Anand Babu
Kodela
  • Loading...

More Telugu News