Pawan Kalyan: రాజకీయ ఒడిదుడుకులు తట్టుకోలేక ప్రాణాలు విడవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది: కోడెల మరణంపై పవన్ వ్యాఖ్యలు

  • కోడెల మృతిపై పవన్ స్పందన
  • తనపై వచ్చిన ఆరోపణలపై పోరాటం చేస్తే బాగుండేదని పవన్ వ్యాఖ్యలు
  • కోడెల మృతికి సంతాపం

గుంటూరు జిల్లా రాజకీయ దిగ్గజం, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణం పట్ల జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన మృతికి తన తరఫున, పార్టీ తరఫున సంతాపం తెలియజేశారు. రాజకీయపరమైన ఒడిదుడుకులు తట్టుకోలేక కోడెల తుదిశ్వాస విడవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఓ ప్రకటనలో తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలను రాజకీయంగానే ఎదుర్కొని ఉంటే బాగుండేదని పవన్ అభిప్రాయపడ్డారు. కోడెల రాజకీయనాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్ గా ఎన్నో పదవులు చేపట్టారని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Pawan Kalyan
Jana Sena
Kodela
Andhra Pradesh
  • Loading...

More Telugu News