Kodela: తలుపులు తెరవాలని భార్య ఎంత గట్టిగా అరిచినా స్పందించని కోడెల!

  • మాజీ స్పీకర్ కోడెల బలవన్మరణం!
  • ఉదయం మామూలుగానే కనిపించిన కోడెల!
  • అల్పాహారం ముగించుకుని బెడ్ రూములోకి వెళ్లి తలుపులు వేసుకున్న వైనం

టీడీపీ అగ్రనేత కోడెల శివప్రసాదరావు మృతితో పల్నాడులో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎలాంటి రాజకీయ వేధింపులనైనా ఎదుర్కొంటానని సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తం చేసిన ఆయన ఉన్నట్టుండి ఉరివేసుకుంటారని ఎవరూ ఊహించలేకపోయారు! ఈ ఉదయం తన నివాసంలో మామూలుగానే కనిపించిన కోడెల ఉదయం 10 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం స్వీకరించారు.

అనంతరం తన బెడ్ రూములోకి వెళ్లి తలుపులు వేసుకోగా, ఆయన భార్య గమనించినట్టు తెలుస్తోంది. ఆమె వెంటనే వెళ్లి తలుపులు తెరవాలని గట్టిగా అరవగా, కోడెల నుంచి స్పందన రాలేదని సమాచారం. దాంతో ఆమె గన్ మన్ ను, వ్యక్తిగత సహాయకుడ్ని పిలవగా, వ్యక్తిగత సహాయకుడు వెనుక తలుపు నుంచి కోడెల గదిలోకి ప్రవేశించాడు. అప్పటికే కోడెల ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. ఆయనను హుటాహుటీన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

Kodela
Andhra Pradesh
Telugudesam
  • Loading...

More Telugu News