Kodela: కోడెల శివప్రసాద్ గారి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నా: దిగ్భ్రాంతికి గురైన చంద్రబాబు

  • కోడెల ఆత్మహత్యపై చంద్రబాబు స్పందన
  • అత్యంత ప్రజాదరణ పొందిన నేత అంటూ వ్యాఖ్యలు
  • కోడెల మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటు అని ఆవేదన

సుదీర్ఘకాలం తనతో రాజకీయ ప్రస్థానం కొనసాగించిన కోడెల శివప్రసాదరావు మరణవార్త తెలియడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. కోడెల చనిపోయారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. డాక్టర్ వృత్తి నుంచి టీడీపీలో చేరి అత్యంత ప్రజాదరణ పొందారని, ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు తీరని లోటు అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కోడెల కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

Kodela
Chandrababu
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News