Telangana: మాజీ స్పీకర్ కోడెల మృతిపై సీఎం కేసీఆర్ సానుభూతి

  • కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
  • ఓ ట్వీట్ లో కేసీఆర్ దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాద్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఓ ట్వీట్ చేశారు.

కాగా, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి స్పందిస్తూ, కోడెల మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. కోడెల లాంటి ధైర్యవంతుడికి ఇలాంటి ముగింపు ఊహించలేదని, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడం దారుణమని అన్నారు.  

Telangana
cm
kcr
TRS
Kadiam Srihari
  • Loading...

More Telugu News