YSRCP: అంతటి ధైర్యవంతుడినీ ఆత్మహత్య చేసుకునేలా వైసీపీ ప్రభుత్వం చేసింది: బుద్ధా వెంకన్న

  • టీడీపీకే కాదు పల్నాడు ప్రాంతానికీ తీరని లోటు
  • కోడెలకు మారుపేరు ‘పల్నాటి పులి’
  • కోడెలపై లేనిపోని అపోహలు సృష్టించారు 

టీడీపీకి చెందిన మరో నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, కోడెల మృతి చాలా బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. తెలుగుదేశం పార్టీకే కాదు పల్నాడు ప్రాంతానికీ తీరని లోటు అని అన్నారు. కోడెలకు మారుపేరు ‘పల్నాటి పులి’ అని, అంతటి ధైర్యవంతుడిని కూడా ఆత్మహత్య చేసుకునేలా వైసీపీ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. కోడెలపై లేనిపోని అపోహలు సృష్టించి, ‘ఓ దొంగగా’ ఆయన్ని చిత్రీకరించారన్న బాధతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, ఇంతకంటే కక్షసాధింపు చర్యలు ఇంకా ఏముంటాయని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోడెల ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని బుద్ధా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు.

YSRCP
Telugudesam
MLC
Buddha venkanna
  • Loading...

More Telugu News