Kodela: కోడెల వంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థంచేసుకోవచ్చు: మాజీ మంత్రి జవహర్

  • కోడెల మృతిపై స్పందించిన జవహర్
  • ఆత్మహత్య చేసుకునేంత బలహీనుడు కాదన్న మాజీ మంత్రి
  • ఆయనను వెంటాడి, వేధించి చంపేశారంటూ వ్యాఖ్యలు

నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, టీడీపీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరణించిన నేపథ్యంలో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకునేంత బలహీనుడు కాదని, ఆయనను వెంటాడి, వేధించి చంపేశారని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. కోడెలది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని ఆరోపించారు. కోడెల ధైర్యం చెప్పే వ్యక్తే కానీ, ధైర్యం కోల్పోయే వ్యక్తి కాదని, కోడెలకు నలుగురికి సాయం చేయడమే తెలుసని జవహర్ వివరించారు. కోడెల వంటి మనిషి కూడా ఆత్మహత్య చేసుకున్నాడంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.

Kodela
Telugudesam
Jawahar
Andhra Pradesh
  • Loading...

More Telugu News