Kodela: గత రాత్రి స్వయంగా ప్రమాదకర ఇంజెక్షన్లు తీసుకున్న కోడెల?

  • ఏపీ మాజీ స్పీకర్ కోడెల కన్నుమూత
  • ఆత్మహత్య చేసుకున్న టీడీపీ సీనియర్ నేత
  • గత రాత్రి సన్నిహితులతో ఫోన్ లో మాట్లాడిన కోడెల

మాజీ స్పీకర్, టీడీపీ అగ్రనేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణం చెందడం తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ లోని తన నివాసంలో ఇవాళ ఉరివేసుకున్న స్థితిలో ఆయనను గుర్తించిన కుటుంబ సభ్యులు సమీపంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అయితే, కోడెల గత కొన్నిరోజులుగా పరిస్థితుల ప్రభావంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితమే ఓసారి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. గతరాత్రి కూడా ప్రమాదకరమైన ఇంజెక్షన్లను స్వయంగా తీసుకుని మరోసారి బలవన్మరణం చెందేందుకు యత్నించినట్టు తెలిసింది. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో సన్నిహితులతో ఫోన్ లో మాట్లాడి, రాజకీయ వేధింపులను దీటుగా ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతలోనే ఆయన ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడం కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీరని వేదనకు గురిచేస్తోంది.

Kodela
Telugudesam
Andhra Pradesh
Hyderabad
  • Loading...

More Telugu News