Telugudesam: కోడెల మృతిపై ఎంపీలు కేశినేని, సుజనా చౌదరి దిగ్భ్రాంతి!

  • కోడెల మృతి వార్త తెలిసి షాక్ కు గురయ్యా
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
  • కోడెల కుటుంబానికి సంతాపం

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.  

కోడెల కుటుంబానికి నా సంతాపం

కోడెల శివప్రసాద్ మరణవార్తను నమ్మలేకపోతున్నానని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. బలవన్మరణానికి పాల్పడతారని ఊహించలేదని, ఈ వార్త తనను కలచివేసిందని ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెబుతూ, ఆయన కుటుంబసభ్యులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News