Kodela: ఉరివేసుకున్న ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్... కన్నుమూత!

  • ఉరి వేసుకున్న కోడెల
  • ఆసుపత్రికి తెచ్చేలోపే ఆగిన గుండె
  • మృతిని ధ్రువీకరించిన డాక్టర్లు

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, మాజీ మంత్రి, గుంటూరు జిల్లాలో ప్రధాన టీడీపీ నేతల్లో ఒకరైన కోడెల శివప్రసాద్ అనూహ్య రీతిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదయం ఉరికి వేలాడుతున్న ఆయన్ను గమనించిన కుటుంబీకులు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకుని వచ్చే వరకే కోడెల శ్వాస ఆడటం లేదని వైద్యులు గుర్తించారు. వెంటనే అత్యవసర చికిత్స చేసినా, ఆయన గుండె స్పందించలేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆయన కన్నుమూశారని, ఆసుపత్రికి తెచ్చేలోపే గుండె ఆగిపోయిందని డాక్టర్లు అంటున్నారు.

Kodela
Died
Sucide
  • Loading...

More Telugu News