godavari boat accident: ఆనంద క్షణాలు ఆవిరైన వేళ... ప్రమాదం జరగడానికి 5 నిమిషాల ముందు తీసిన వీడియో!

  • ఆటపాటలతో సందడి చేసిన పర్యాటకులు
  • సెల్ఫీలు దిగుతూ ఉత్సాహం
  • చివరి క్షణాల్లో తీసిన వీడియో బయటకు

అటు పాపికొండలు... ఇటు గోదారమ్మ ప్రవాహం...హోరు గాలి మేనును తాకుతుంటే...వరద ప్రవాహం హోరెత్తిస్తుంటే పర్యాటకుల్లో ఒక్కటే సందడి. ప్రకృతి అందాలను వీక్షిస్తూ ఆనంద పరవశులై తమను తాము మర్చిపోయి గోదారమ్మ ప్రవాహపు వయ్యారాలను వీక్షిస్తూ.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సందడి చేస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ మధురమైన జ్ఞాపకాలను పదిల పరుచుకునే పనిలో మరికొందరు ఉన్నారు. గోదావరి అందాలు, పాపికొండల సుందర దృశ్యాలను వీడియో తీసి తమ పర్యాటక అనుభవాన్ని తోటి వారితో పంచుకునేందుకు ఇంకొందరు సిద్ధం అవుతున్నారు.

ఇంతలోనే పెద్ద కుదుపు. ఏం జరిగిందా? అని చూసేలోగానే గోదావరి జలాల్లో బోటు మునిగిపోవడంతో ఒక్కసారిగా హాహాకారాలు.. అరుపులు.. కేకలు.. ఆ కాసేపటికి అవన్నీ  ఆగిపోయాయి. అప్పటి వరకు సందడి నెలకొన్న ప్రాంతంలో కాసేపు నిశ్శబ్దం. గోదావరిలో బోటు ప్రమాదానికి ఐదు నిమిషాల ముందు బోటులోనే ప్రయాణించిన ఓ పర్యాటకుడు తీసిన వీడియోను ఒకటి ఇప్పుడు న్యూస్ చానెళ్లు ప్రసారం చేస్తున్నాయి. ఇందులో గోదావరిలో బోటు వెళుతున్న వేళ, అదే బోటులో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన దృశ్యాలున్నాయి. 

godavari boat accident
before 5mnts vedio
tourists enjoyment
  • Error fetching data: Network response was not ok

More Telugu News