Rats: మనకి తెలియకుండానే మనల్ని ముగ్గులోకి దించే ఎలుకలు: పరిశోధనలో వెల్లడి
- దాగుడుమూతలు ఆట ఆడడం వాటికి ఎంతో సరదా
- మనకు తెలియకుండానే మనల్ని ఆటలోకి దింపుతాయి
- జర్మన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
ఇంట్లోని ఎలుకలకు మనతో దాగుడు మూతలు ఆట ఆడడం అంటే మహా సరదా అని జర్మన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంట్లోని ఎలుకలు కొన్నిసార్లు మనకు కనిపిస్తూ, ఆ వెంటనే దాక్కుని ముప్పుతిప్పలు పెడతాయన్న విషయం తెలిసిందే. అయితే, అవి ఎందుకలా ప్రవర్తిస్తాయన్న దానిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు దాగుడు మూతలంటే వాటికి చాలా సరదా అని, అందుకే అవి అలా చేస్తాయని తమ పరిశోధనలో వెల్లడైనట్టు తెలిపారు.
మనుషుల్ని చూసినప్పుడు అవి ఆనందంతో ఆటను కొనసాగించేందుకు పదేపదే దాక్కుంటాయని పేర్కొన్నారు. సరికొత్త వ్యూహాలతో మనకు తెలియకుండానే మనల్ని ఆ ఆటలో భాగస్వామ్యం చేస్తాయని వివరించారు. 30 మీటర్ల గదిలో కొన్ని ఎలుకలను ఉంచి నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని వారు తెలిపారు.