East Godavari District: కాకినాడలో హెడ్మాస్టర్ దారుణ హత్య

  • శనివారం రాత్రి ఘటన
  • ఇంట్లోకి చొరబడి నరికి చంపిన దుండగులు
  • హత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. తూరంగికి చెందిన వెంకట్రావు రేవూరు ఎంపీపీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి ఆయన తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆయనను నరికి చంపారు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు లేరని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆయన హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

East Godavari District
kakinada
head master
murder
  • Loading...

More Telugu News