Virat Kohli: వచ్చిన చాన్సును సద్వినియోగం చేసుకోవడమే... టైమ్ లేదు: ఆటగాళ్లకు స్పష్టం చేసిన కోహ్లీ

  • వచ్చే ఏడాది టి20 వరల్డ్ కప్
  • ఐదు మ్యాచ్ లలో నిరూపించుకోకపోతే కష్టమేనన్న కోహ్లీ
  • టీమిండియా బెర్తు కోరుతున్న ఆటగాళ్లకు మార్గదర్శనం

వచ్చే ఏడాది టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో, టీమిండియాలో స్థానం ఆశిస్తున్న ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. వరల్డ్ కప్ కు ఎక్కువ సమయం లేదని, వచ్చిన చాన్సులను సద్వినియోగం చేసుకోవడమొక్కటే మార్గమని తేల్చి చెప్పాడు.

"ప్రతి ఆటగాడికి 30 చాన్సులు ఇస్తామని చెప్పలేం, నా విషయంలో 15 నుంచి 20 మ్యాచ్ లు కూడా ఆడతానని అనుకోలేదు, ఆడిన మూడు లేదా ఐదు మ్యాచ్ లలో నన్ను నేను నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలుసుకున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఐదు చాన్సులు వచ్చాయంటే అతడు తప్పకుండా నిరూపించుకోవాల్సిందే. ప్రస్తుతం టీమిండియాలో నెలకొన్న పరిస్థితి ఇది. టీమిండియా మేనేజ్ మెంట్ ఆలోచన సరళి కూడా ఇలాగే ఉంటుంది, ఆటగాడు కూడా ఇలాగే ఆలోచించాల్సి ఉంటుంది" అని కోహ్లీ వివరించాడు.

Virat Kohli
Team India
Cricket
T20 Worldcup
  • Loading...

More Telugu News