Kanna: ఎవరో ఒకరి స్వలాభానికి ప్రజల ప్రాణాలు పోతున్నాయి: బోటు ప్రమాదంపై కన్నా వ్యాఖ్యలు

  • తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్న కన్నా
  • అయినా అధికారులు దృష్టి సారించడంలేదని విమర్శ
  • ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచన

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద పర్యాటక బోటు మునిగిపోయిన ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గల్లంతైన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. గోదావరిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు దృష్టి సారించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో ఒకరి స్వలాభానికి ప్రజల ప్రాణాలు పోతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కన్నా విజ్ఞప్తి చేశారు.

Kanna
Andhra Pradesh
BJP
Godavari
Boat
East Godavari District
  • Loading...

More Telugu News