East Godavari: బోటు ప్రమాదం..39 మంది ఆచూకీ గల్లంతు!

  • బోటులో మొత్తం 73 మంది ప్రయాణికులు
  • సురక్షితంగా బయటపడింది 26 మంది
  • ఇప్పటివరకు లభ్యమైన మృతదేహాల సంఖ్య 8  

తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాద ఘటనపై అధికారిక వర్గాల తాజా సమాచారం తెలిసింది. బోటులో మొత్తం 73 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిపారు. 26 మంది సురక్షితంగా బయటపడ్డారని, 39 మంది ఆచూకీ గల్లంతైందని, ఇప్పటివరకు 8 మృతదేహాలు లభ్యమైనట్టు చెప్పారు. కాగా, సురక్షితంగా బయటపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 ప్రమాద బాధితులను మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అవసరమైతే, విశాఖపట్టణం, రాజమండ్రికి తరలించాలని ఆదేశించారు.

East Godavari
Godavari
River
Boat
Accident
  • Loading...

More Telugu News