East godavari: ఈ డ్రైవర్లకు నదిలో బోటు నడిపిన అనుభవం లేదు!

  • రెండు కొండల మధ్య ‘గోదావరి’ సుడులు తిరుగుతుంది
  • అక్కడ సీనియర్ డ్రైవర్లే  బోటును దాటించగల్గుతారు
  • బోటును బయటకు తీశాకే మృతుల సంఖ్యపై స్పష్టత  

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో తిరగబడ్డ బోటును రేపు ఉదయం వెలికితీసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. చీకటి పడటంతో సహాయక చర్యలకు అడ్డంకులు తలెత్తాయి. బోటును బయటకు తీశాకే మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి కారణం గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటం, బోటు నడిపిన డ్రైవర్లకు అనుభవం లేకపోవడేమనని తెలుస్తోంది.

సముద్రంలో బోటు నడిపిన అనుభవం ఈ డ్రైవర్లకు ఉంది కానీ గోదావరి నదిలో నడిపిన అనుభవం లేదని సమాచారం. కచ్చులూరు వద్ద రెండు కొండల మధ్య ‘గోదావరి’ సుడులు తిరుగుతుందని, అక్కడ సీనియర్ డ్రైవర్లు తప్ప వేరే డ్రైవర్లు బోటును దాటించలేరని చెబుతున్నారు. గోదావరి నదిలో సుడులు తిరిగినప్పుడు బోటు పక్కకు ఒరిగి ఉండొచ్చని లేదా బోటు వేగాన్ని తగ్గించకపోవడం వల్లనో ఈ ప్రమాదం  జరిగి ఉండొచ్చని టూరిస్ట్ బోట్ల సీనియర్ డ్రైవర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

East godavari
Boat-accident
Godavari
River
  • Loading...

More Telugu News