KTR: ఇలాంటి నాయకులే నాకిష్టం... కేటీఆర్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండ

  • యురేనియం తవ్వకాలపై స్పందించిన కేటీఆర్
  • తమ ప్రభుత్వం అనుమతించబోదని స్పష్టంచేసిన కేటీఆర్
  • కేటీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన విజయ్ దేవరకొండ

తెలుగు రాష్ట్రాల్లో వేలాది ఎకరాల మేర విస్తరించిన సువిశాల నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. దీనిపై స్పందించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు తమ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంలేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పట్ల యంగ్ హీరో విజయ్ దేవరకొండ సంతోషం వ్యక్తం చేశారు. అడిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వం మన వెంటే నిలిచింది. మీ నిర్ణయం నా ముఖంపై చిరునవ్వులు తీసుకొచ్చింది అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి విజయ్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. పవర్, రెస్పాన్సిబిలిటీ, యాక్షన్... ఇలాంటి నాయకులనే నేను ఇష్టపడతాను అంటూ పేర్కొన్నారు. కేటీఆర్ అన్నా, మీపై ఎల్లప్పుడూ ప్రేమాభిమానులు ఉంటాయని వ్యాఖ్యానించారు.

KTR
Vijay Devarakonda
Nallamala
Urenium
  • Loading...

More Telugu News