Godavari: పాపికొండల్లో విషాదం... బోటు డ్రైవర్లిద్దరూ మృతి

  • పాపికొండలు వెళుతున్న బోటు
  • మధ్యలోనే మునక
  • 16 మంది సురక్షితం
  • 12 మంది మృతి

గోదావరి నదిలో ఇవాళ జరిగిన పడవ ప్రమాదం యావత్ భారతదేశాన్ని విషాదంలో ముంచెత్తింది. 72 మందితో పాపికొండలు విహారయాత్రకు వెళుతున్న బోటు మధ్యలోనే మునిగిపోవడంతో 12 మంది వరకు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో గల్లంతయ్యారు. ఇప్పటివరకు 16 మంది సురక్షితంగా ఉన్నట్టు గుర్తించారు. కాగా, మరణించినవారిలో బోటు డ్రైవర్లు నూకరాజు, తామరాజు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన చోట పెద్ద సుడిగుండం ఉంటుందని, అక్కడ బోటును అదుపుచేయడంలో డ్రైవర్లు విఫలం కావడంతోపాటు, బోటుపైకి ప్రయాణికులు ఒకే సారి పెద్ద సంఖ్యలో చేరడం కూడా ప్రమాదానికి దారితీసిందని అంచనా వేస్తున్నారు.

Godavari
East Godavari District
Boat
Drivers
  • Loading...

More Telugu News