Narendra Modi: తూర్పు గోదావరి జిల్లాలో బోటు మునక ఘటనపై చాలా బాధపడుతున్నాను: మోదీ

  • గోదావరి నదిలో మునిగిపోయిన లాంచీ
  • పలువురు ప్రయాణికులు గల్లంతు
  • బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ గోదావరి నదిలో లాంచీ మునకపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ బోటు నదిలో మునిగిపోయిందని తెలిసి ఎంతో బాధపడుతున్నానని తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషాద ఘటన జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని మోదీ ట్వీట్ చేశారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 12 మంది మృత్యువాత పడ్డారు. పడవలో 72 మంది ఉండగా, అనేకమంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

Narendra Modi
East Godavari District
Boat
Godavari
  • Loading...

More Telugu News