Godavari: గోదావరి బోటులో తెలంగాణ వాసులు... పలువురి గల్లంతు!

  • విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్, వరంగల్ వాసులు
  • ఐదుగురు వరంగల్ వాసులు సురక్షితం
  • ఇంకా తెలియని హైదరాబాదీల క్షేమ సమాచారం

వరద ఉద్ధృతితో పరవళ్లు తొక్కుతున్న గోదావరి నదిలో రాయల్ వశిష్ఠ అనే లాంచీ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు తెలంగాణ వాసులు కూడా ఉన్నట్టు తెలిసింది. 22 మంది హైదరాబాదీలు, 14 మంది వరంగల్ కు చెందినవారు కూడా ఈ బోటులో ఉన్నారు.  అయితే వరంగల్ కు చెందినవారిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, 9 మంది గల్లంతయ్యారు. హైదరాబాద్ వాసుల పరిస్థితి తెలియరాలేదు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన ప్రమాదంలో 72 మందితో ప్రయాణిస్తున్న లాంచీ మునిగిపోయింది. ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్టు గుర్తించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

Godavari
East Godavari District
Boat
Hyderabad
Warangal
  • Loading...

More Telugu News