East Godavari District: లాంచీ ప్రమాదం చాలా దురదృష్టకరం: మంత్రి కన్నబాబు

  • అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు
  • ప్రభుత్వ పరంగా అన్ని సహాయకచర్యలు తీసుకుంటాం
  • సంఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్తున్నాయి

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం సమీపంలో గోదావరిలో లాంచీ మునిగిన ఘటనపై  ఏపీ మంత్రి కురసాల కన్నబాబు స్పందించారు. లాంచీ ప్రమాదం చాలా దురదృష్టకరమని, రాయల్ వశిష్ట లాంచీకి ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం అని అన్నారు. ఘటనా స్థలానికి విశాఖ, మంగళగిరి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్తున్నాయని, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పరంగా అన్ని సహాయకచర్యలు తీసుకోవాలని, సీఎం జగన్ ఆదేశించారని అన్నారు. సంఘటనా స్థలానికి టూరిజం శాఖ నుంచి అదనపు బోట్లను తరలిస్తున్నటు తెలిపారు.

East Godavari District
Devipatnam
Boat
kannababu
  • Loading...

More Telugu News