Janasena: పవన్ కల్యాణ్ ను ప్రజలు బఫూన్ లా చూస్తున్నారు: సామినేని ఉదయభాను

  • ప్రజాస్వామ్య విలువలకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు
  •  చంద్రబాబు తన ఉనికిని కోల్పోతున్నారు
  •  రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరగట్లేదు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత సామినేని ఉదయభాను తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ని ప్రజలు ఓ బఫూన్ లా చూస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని, రాష్ట్రాభివృద్ధికి జగన్ నిరంతరం పాటుపడుతున్నారని అన్నారు. ఆ అంశాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు.

వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ దాదాపు అమలు చేశారని అన్నారు. రోజురోజుకీ చంద్రబాబు తన ఉనికిని కోల్పోతున్నారని, రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరగడం లేదని, చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని నిప్పులు చెరిగారు.

Janasena
Pawan Kalyan
YSRCP
samineni
  • Loading...

More Telugu News