రేణూ దేశాయ్ కు ‘డెంగీ’ వ్యాధి.. సోషల్ మీడియాలో ప్రకటించిన నటి!
- ప్రస్తుతం కోలుకుంటున్న రేణూ
- ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచన
- త్వరలోనే ఓ సినిమాకు దర్శకత్వం
ఈ విషయమై ఇన్ స్టాగ్రామ్ లో రేణూ దేశాయ్ స్పందిస్తూ..‘ఈటీవీలో ప్రసారం కాబోయే ఢీ ఛాంపియన్ షో 12వ సీజన్ కోసం షూటింగ్ జరిగింది. కొన్నిగంటల పాటు జరిగిన షూటింగ్ కు నేను కాదని చెప్పలేకపోయా. దోమల నుంచి జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పొడవైన దుస్తులనే ధరించండి’ అని సూచించారు. ఈ సందర్భంగా డెంగీ వ్యాధితో షూటింగ్ లో పాల్గొన్న సమయంలో దిగిన ఓ ఫొటోను రేణూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేణూ దేశాయ్ త్వరలోనే రైతుల కథాంశంతో ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.