USA: ‘అస్సాం రెజిమెంట్’ పాటకు చిందేసిన అమెరికా-భారత సైన్యాలు.. వీడియో అదరహో అంటున్న నెటిజన్లు!

  • అమెరికాలోని వాషింగ్టన్ లో ఘటన
  • యుద్ధ అభ్యాస్ విన్యాసాల్లో పాల్గొంటున్న సైనికులు
  • ఖాళీ సమయంలో అద్భుతమైన వీడియో చిత్రీకరణ

అగ్రరాజ్యం అమెరికా, భారత్ లు ‘యుద్ధ అభ్యాస్’ పేరిట ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో లూయిస్-మెక్ఛోర్డ్ ఆర్మీ బేస్ లో ఈ నెల 5 నుంచి 18 వరకూ సైనిక విన్యాసాలు సాగుతాయి. ఇందులో భాగంగా ఉగ్రవాదుల ఏరివేత, ల్యాండ్ మైన్ల గుర్తింపు, ఉగ్రచెర నుంచి ప్రజలను కాపాడటానికి సంబంధించి ప్రత్యేక శిక్షణను చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన వీడియో వెలుగులోకి వచ్చింది.

శిక్షణా సమయం పూర్తయ్యాక అమెరికా-భారత సైనికులు కలిసి అస్సాం రెజిమెంట్ మార్చింగ్ సాంగ్ ‘బద్లూరామ్ కా బంధన్ జమీన్ కే నీచే హై’ను అద్భుతంగా పాడారు. ఈ పాటలు చప్పట్లు కొడుతూ, కాళ్లను లయబద్ధంగా కదలిస్తూ ఎంజాయ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇరుదేశాల సైనికులు ఈ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీన్ని మీరూ చూసేయండి.  

  • Loading...

More Telugu News