nagarjuna sagar: నాగార్జునసాగర్ జలాశయానికి తగ్గిన ఇన్‌ఫ్లో...వరద ప్రమాదం లేదన్న అధికారులు
- ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహం తగ్గడమే కారణం
- ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఇన్‌ఫ్లో
- అదే మొత్తం నీటిని దిగువకు వదులుతున్న అధికారులు
సాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం పడుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి రెండు రోజుల క్రితం వరకు భారీగా వరద వచ్చి చేరిన విషయం తెలిసిందే. దీంతో వరద భయంతో తెలంగాణ పర్యాటక శాఖ ఈరోజు సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని కూడా రద్దు చేసింది. అయితే పరీవాహక ప్రాంత పరిస్థితుల్లో మార్పు రావడం, ఎగువ నుంచి కూడా వరద ప్రవాహం తగ్గడంతో సాగర్‌కు జలకళ తగ్గుముఖం పట్టింది. వరద ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పది క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి 2,04,527 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అంతే మొత్తం నీటిని బయటకు వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగుల కాగా ప్రస్తుతం 589.5 అడుగుల నీరుంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను ప్రస్తుతం 310.55 టీఎంసీలు ఉంది.