Imran Khan: ఇండియాతో యుద్ధం చేయాల్సి వస్తే, మేమే ఓడిపోతాం: అంగీకరించిన ఇమ్రాన్ ఖాన్

  • సంప్రదాయ యుద్ధంలో గెలవలేము
  • అణ్వస్త్రాలు వాడితే మాత్రం తీవ్ర పరిణామాలు
  • అల్ జజీరాకు ఇమ్రాన్ ప్రత్యేక ఇంటర్వ్యూ

ఇండియా శక్తి సామర్థ్యాల ముందు నిలబడే శక్తి పాకిస్థాన్ కు లేదని, సంప్రదాయ యుద్ధమే చేయాల్సి వస్తే, పాకిస్థాన్ ఓడిపోయే అవకాశాలే అధికంగా ఉన్నాయని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. అల్ జజీరా కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సాధారణ యుద్ధంలో తాము ఓడిపోయినా, అణుయుద్ధంలో మాత్రం సత్తా చూపుతామంటూ ఇమ్రాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశారు.

యుద్ధం అంటూ జరిగితే, రెండు దేశాలూ అణ్వస్త్రాలను ఉపయోగిస్తాయని, అదే జరిగితే, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తాను యుద్ధాన్ని కోరుకోవడం లేదని అంటూనే ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, పీకల్లోతు కష్టాల్లో ఉన్న దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టిగా నిలుపుతానని, ఇండియాతో సత్సంబంధాలు కొనసాగిస్తానని హామీ ఇచ్చి, ప్రజల ఓట్లను కొల్లగొట్టి, అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్, అవేమీ చేయలేకపోయారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాశ్మీర్ విషయంలో, ఆర్టికల్ 370 రద్దు అంశంలో అంతర్జాతీయ మద్దతు తమకు లేదని అంగీకరించిన ఆయన, ఇప్పుడు యుద్ధం జరిగితే, తమకు ఓటమి తప్పదని వ్యాఖ్యానించడం గమనార్హం.

Imran Khan
India
War
Atomic War
Pakistan
  • Loading...

More Telugu News