governor: తెలంగాణ గవర్నర్‌కు ఢిల్లీ పిలుపు...ఈరోజు దేశ రాజధానికి తమిళిసై

  • బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ప్రయాణం
  • రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానితో భేటీ
  • రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి నేపథ్యంలో ఆసక్తిదాయకం

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి  ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆమె ఈ రోజు రాజధానికి ప్రయాణమవుతున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఆమె ఢిల్లీ వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి బలపడాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ పార్టీ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసైని ఏరికోరి ఇక్కడ గవర్నర్ గా నియమించింది.

ఈ నేపథ్యంలో ఆమె  ఢిల్లీ  ప్రయాణంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో ఆమె రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానితో భేటీ కానున్నారు. మరో వైపు బాధ్యతలు స్వీకరించాక రాష్ట్ర పరంగా నిర్వహించాల్సిన బాధ్యతలపైనా గవర్నర్‌ దృష్టిసారిస్తున్నారు. చాలా యూనివర్సిటీ ఉపకులపతుల పదవీ కాలం ముగియడంతో కొత్త వారిని నియమించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈనెల 24న ఆమె వీసీలతో తొలి సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యా శాఖపై కూడా ఆమె సమీక్ష నిర్వహిస్తారని సమాచారం.

governor
tamil sai
new delhi tour
political
  • Loading...

More Telugu News