Telangana: రాత్రిపూట ఎగురుతున్న డ్రోన్లు.. నల్గొండ జిల్లాలో కలకలం

  • గుర్రంపోడు మండలంలో ఎగురుతున్న డ్రోన్లు
  • భయాందోళనలో స్థానికులు
  • ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్న స్థానికులు

నల్గొండ జిల్లాలో రాత్రిపూట డ్రోన్లు ఎగురుతూ కనిపిస్తుండడంతో కలకలం రేగింది. గుర్రంపోడు మండలంలో రాత్రిపూట గత కొన్ని రోజులుగా డ్రోన్ల ప్రయోగం జరుగుతోందని స్థానికులు తెలిపారు. ఊట్లపల్లి, వెంకటాపురం, మాదాపురం మధ్య గుట్టల్లో ఇవి ఎగురుతున్నాయని పేర్కొన్నారు. అవి ఎందుకు ఎగురుతున్నాయో, ఎవరు ప్రయోగిస్తున్నారో తమకు అర్థం కావడం లేదన్నారు. డ్రోన్ల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. డ్రోన్లు తమను భయపెడుతున్నాయని, ఈ విషయంలో పోలీసులు ఇప్పటికైనా స్పందించి వాటి సంగతి చూడాలని కోరుతున్నారు.

Telangana
Nalgonda District
drones
  • Loading...

More Telugu News