Rapaka: వైసీపీ కార్యకర్తలకు తప్ప పోలీస్ స్టేషన్లలో ఎవరికీ న్యాయం జరగడంలేదు: జనసేన ఎమ్మెల్యే రాపాక

  • జగన్ 100 రోజుల పాలనపై జనసేన ఎమ్మెల్యే స్పందన
  • రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందంటూ ఆరోపణ
  • కోనసీమలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదంటూ ఆవేదన

సీఎం జగన్ 100 రోజుల పాలనపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పందించారు. ఈ వంద రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని, వైసీపీ కార్యకర్తలకు తప్ప పోలీస్ స్టేషన్లలో ఎవరికీ న్యాయం జరగడంలేదని ఆరోపించారు. నేటికీ రాజోలులో 144 సెక్షన్ అమలులో ఉందని అన్నారు. ప్రశాంతతకు మారుపేరైన కోనసీమలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని రాపాక ఆవేదన వ్యక్తం చేశారు.

Rapaka
Jana Sena
Andhra Pradesh
Jagan
YSRCP
  • Loading...

More Telugu News