Mahesh Babu: మైగ్రేన్ తలనొప్పికి తిరుగులేని ట్రీట్ మెంట్ ఇదే.. నాకు పూర్తిగా తగ్గిపోయింది!: మహేశ్ బాబు

  • చాలాకాలం మైగ్రేన్ తో బాధపడిన మహేశ్
  • డాక్టర్ సత్య సింధూజ ట్రీట్ మెంట్ తో మైగ్రేన్ మాయమైందన్న మహేశ్
  • చక్రసిద్ధ నాడీ వైద్యం గురించి వెల్లడి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎప్పుడూ నవ్యోత్సాహంతో తొణికిసలాడుతుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే మహేశ్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు, స్టాఫ్ కు మాత్రమే తెలిసిన విషయం మరొకటి ఉంది. ఆయన సుదీర్ఘకాలంగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడ్డారు. అనేకమంది డాక్టర్లను సంప్రదించినా ఫలితం లేకపోయిందని, కానీ ఓ ప్రాచీన వైద్యవిధానంతో తనను వేధిస్తున్న బాధ నుంచి విముక్తడ్నయ్యానని వివరించారు. మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న కాలంలో తన అర్ధాంగి నమ్రత ఓ స్నేహితురాలి ద్వారా డాక్టర్ సత్య సింధూజను కలిసిందని మహేశ్ చెప్పుకొచ్చారు.

సత్య సింధూజ చక్రసిద్ధ నాడీ వైద్యంలో నిపుణురాలని వివరించారు. ఆమె అందించిన చికిత్సతో మైగ్రేన్ తలనొప్పి మటుమాయం అయిందని, తనలా మైగ్రేన్ తో బాధపడుతున్న వాళ్ల కోసమే ఈ విషయం వెల్లడిస్తున్నానని మహేశ్ తెలిపారు. మైగ్రేన్ నుంచి శాశ్వత ఉపశమనం కావాలంటే మాత్రం చక్రసిద్ధ నాడీ వైద్యం ఒక్కటే మార్గమని తన అభిప్రాయం అని, ఈ వైద్య విధానం అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని వివరించారు.

Mahesh Babu
Tollywood
Migraine
  • Loading...

More Telugu News