Kurnool District: కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి: కన్నా

  • ప్రొద్దుటూరులో కన్నా మీడియా సమావేశం
  • ప్రభుత్వం రాయలసీమ బోర్డు ఏర్పాటు చేయాలని సూచన
  • ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలంటూ డిమాండ్

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కడప జిల్లా ప్రొద్దుటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర సర్కారుపై వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని కన్నా కోరారు. కనీసం ఈ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వంతో సహకరించాలని హితవు పలికారు.

 కేంద్రానికి సహకరించడం ద్వారా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసినవారవుతారని పేర్కొన్నారు. అంతేగాకుండా, రాయలసీమ వెనుకబాటుతనంపై వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. రాయలసీమ కరవు పరిస్థితులపై వైసీపీ సర్కారు ఇప్పటికీ స్పందించకపోవడం దారుణమని కన్నా అభిప్రాయపడ్డారు.

Kurnool District
High Court
Kanna
BJP
  • Loading...

More Telugu News