Nagaland: నాగాలాండ్ లారీకి దేశంలోనే అత్యధిక జరిమానా విధించిన అధికారులు
- ఒడిశాలోని సందల్ పూర్ లో వాహనాల తనిఖీలు
- నాగాలాండ్ లారీని ఆపిన ఆర్టీవో అధికారులు
- పత్రాలు సరిగాలేవంటూ రూ.6.53 లక్షల జరిమానా
రహదారిపై ప్రయాణించే సమయంలో వాహనాలకు పత్రాలు లేకపోవడం వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ విధించే జరిమానాలు మహా అయితే వేలల్లోనే ఉంటాయి. కానీ నాగాలాండ్ కు చెందిన ఓ లారీకి దిమ్మదిరిగిపోయే రీతిలో ఫైన్ వేశారు. పత్రాలు సరిగాలేవంటూ నాగాలండ్ లారీకి రూ.6,53,100 జరిమానా వడ్డించారు. ఒడిశాలోని సందల్ పూర్ లో తనిఖీల సందర్భంగా ఆర్టీవో అధికారులు ఈ రికార్డు జరిమానా విధించారు. ఇప్పటివరకు దేశంలో విధించిన జరిమానాలన్నింటిలోకి ఇదే అత్యధికమని చెప్పాలి. ఇంత జరిమానా చూసి లారీ యజమానికి కళ్లు బైర్లు కమ్మి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.