Chandrababu: మనకంటూ ఓ నగరం లేకపోతే బిడ్డల భవిష్యత్తు ఎలా అనే ఆందోళన ప్రజల్లో ఉంది: చంద్రబాబు

  • పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
  • రాజధానిపై ప్రజల్లో చర్చ జరుగుతోందన్న టీడీపీ అధినేత
  • యువతలోనూ అసంతృప్తి పెల్లుబుకుతోందంటూ వ్యాఖ్యలు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తాజా పరిణామాలపై స్పందించారు. రాజధాని అమరావతిపై ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని తెలిపారు. రాజధాని చుట్టూ ముసురుకున్న పరిణామాలతో ప్రజలు సైతం కలత చెందుతున్నారని, మనకంటూ ఓ నగరం లేకపోతే బిడ్డల భవిష్యత్తు ఎలా అనే ఆందోళన వారిలో కలుగుతోందని అన్నారు. యువత కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఉద్యోగం కావాలంటే పరాయిరాష్ట్రానికి వెళ్లాల్సిందేనా? అనే భావన యువతలో ఉందని పేర్కొన్నారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా విమర్శలు సంధించారు. జగన్ వైఖరి పట్ల రాష్ట్రంలో ఎవరూ సంతృప్తికరంగా లేరని వ్యాఖ్యానించారు. సొంత పార్టీలోనే జగన్ పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోందని, జాతీయ మీడియా సైతం జగన్ పద్ధతిని తప్పుబడుతోందని అన్నారు.

  • Loading...

More Telugu News