Badminton: పీవీ సింధుకు మరో గౌరవం.. మైసూరు దసరా వేడుకలకు రావాలని కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానం!

  • ఆహ్వానిస్తూ లేఖ రాసిన సీఎం యడియూరప్ప
  • కర్ణాటక ఆహ్వానాన్ని అంగీకరించిన క్రీడాకారిణి
  • వచ్చే నెల 1 నుంచి దసరా ఉత్సవాలు

భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ ఛాంపియన్ షిప్ విజేత పీవీ సింధుకు మరో గౌరవం దక్కింది. కర్ణాటకలోని మైసూరులో జరిగే దసరా ఉత్సవాలకు రావాలని ఆహ్వానం అందింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఈ మేరకు సింధుకు లేఖ రాశారు.

మైసూరు పార్లమెంటు సభ్యుడు ప్రతాప్ సింహా, ఎస్పీ రిష్యంత్ ఈరోజు ప్రత్యేకంగా హైదరాబాద్ లోని సింధు ఇంటికి వచ్చి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వాన లేఖను అందజేశారు. ఇందుకు సింధు, ఆమె కుటుంబ సభ్యులు సంతోషంగా అంగీకరించారు. వచ్చే నెల 1 నుంచి మైసూరులో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు సింధు తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకానుంది.

Badminton
PV Sindhu
Karnataka
Chief Minister
Yadiyurappa
Invitation
Mysore dassara celebrations
  • Loading...

More Telugu News