udayan raje bhosle: మహారాష్ట్రలో ఎన్సీపీకి షాక్.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఛత్రపతి శివాజీ వంశస్థుడు!

  • బీజేపీలో చేరిన ఉదయన్ భోంస్లే
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అమిత్ షా
  • మోదీ విధానాలు నచ్చడంతోనే చేరానన్న భోంస్లే

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఛత్రపతి శివాజీ వంశానికి చెందిన సతారా పార్లమెంటు సభ్యుడు ఉదయన్ రాజే భోంస్లే బీజేపీలో చేరారు. ఎన్సీపీకి, ఎంపీ పదవికి రాజీనామా సమర్పించిన భోంస్లే ఈరోజు బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సాదర స్వాగతం పలికారు.

ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రభుత్వ విధానం నచ్చే తాను బీజేపీలో చేరానని భోంస్లే ప్రకటించారు. ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వంలో పార్టీ బలోపేతానికి పనిచేస్తానని చెప్పారు. భోంస్లే పార్టీలో చేరడంపై  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీలో మూడొంతుల సీట్లను స్వాధీనం చేసుకుంటామని షా ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News