Modi: అదే జరిగితే ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించడం కష్టం: జేసీ దివాకర్ రెడ్డి

  • దేశంలో మోదీ హవా నడుస్తోంది
  • ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు
  • జమిలీ ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలకు కష్టమే

ప్రధాని మోదీపై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం దేశంలో మోదీ హవా నడుస్తోందని చెప్పారు. మోదీ ప్రభంజనం వల్లే ఇతర పార్టీలకు చెందిన నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. ఏపీలో కూడా పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరారని... చంద్రబాబు చేసిన కొన్ని తప్పులు, మోదీ ప్రవేశపెట్టిన పథకాలే దీనికి కారణమని చెప్పారు. జమిలీ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని... ఆ ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఏడాది తర్వాత ముఖ్యమంత్రి జగన్ 100 రోజుల పాలనపై మాట్లాడతానని చెప్పారు.

Modi
JC Diwakar Reddy
Jagan
Chandrababu
Telugudesam
YSRCP
BJP
  • Loading...

More Telugu News