KTR: కేటీఆర్ గారూ, సురభి నాటకాలు కట్టిపెట్టి.. ముందుగా ఆ పని చేయండి: రేవంత్ రెడ్డి

  • యురేనియం తవ్వకాలపై సర్వత్ర విమర్శలు
  • సీఎం దృష్టికి తీసుకెళ్తానని ట్వీట్
  • తొలుత అనుమతులు రద్దు చేయాలని సూచన

నల్లమలలో యురేనియం తవ్వకాల వ్యవహారంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతుండడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంలో ప్రజల ఆవేదనను అర్థం చేసుకుంటామని పేర్కొన్న ఆయన.. వ్యక్తిగతంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందిస్తూ ట్వీట్ చేశారు. సురభి నాటకాలు కట్టిపెట్టి తొలుత  యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని సూచిస్తూ ట్వీట్ చేశారు.

KTR
Revanth Reddy
uranium mining
nallamala forest
  • Loading...

More Telugu News