Sonia Gandhi: కాంగ్రెస్ చీఫ్‌గా ప్రియాంక గాంధీ.. సోనియాపై నేతల ఒత్తిడి

  • సోనియా నివాసంలో కాంగ్రెస్ సీఎంల సమావేశం
  • సంస్థాగత ఎన్నికల తర్వాత ప్రియాంకకు పగ్గాలు అప్పగించాలన్న నేతలు
  • రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం కాకుండా అడ్డుకోవాలన్న సోనియా

క్రియాశీలక రాజకీయాల్లో ఇటీవల చురుగ్గా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సోనియా గాంధీ అధ్యక్షతన శుక్రవారం కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. సోనియా నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్, చత్తీస్‌గఢ్ సీఎం భూషేశ్ బఘేల్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ అధ్యక్ష పదవి ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రియాంకకు కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు అప్పగించాలని సోనియాపై ఒత్తిడి తీసుకొచ్చారు. సంస్థాగత ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంకలలో ఎవరో ఒకరు నాయకత్వ బాధ్యతలు స్వీకరించకపోతే మోదీని ఎదుర్కోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం కాకుండా అడ్డుకోవాలని, మంచి పరిపాలన ద్వారా ప్రజల అభిమానం చూరగొనాలని ముఖ్యమంత్రులకు సూచించారు.

  • Loading...

More Telugu News