Microsoft: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి యుగంధర్ కన్నుమూత

  • అనారోగ్యంతో మరణించిన బీఎన్ యుగంధర్
  • యుగంధర్ 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి
  • నిబద్ధత ఉన్న అధికారిగా గుర్తింపు

దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్ అనారోగ్యంతో మరణించారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. యుగంధర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. యుగంధర్ 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నిబద్ధత ఉన్న అధికారిగా పేరొందిన ఆయన యూపీఏ పాలనలో ప్రణాళిక సంఘం సభ్యుడిగా వ్యవహరించారు. అంతకుముందు పీవీ నరసింహారావు హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖలో తనదైన ముద్ర వేశారు. కీలక సంస్కరణలతో ఆ శాఖను పరిపుష్టం చేశారు.

Microsoft
Satya Nadella
BN Yugandhar
  • Loading...

More Telugu News