Chidambaram: ఇంటి భోజనం తెప్పించుకుంటానన్న చిదంబరం... కుదరదన్న హైకోర్టు

  • తీహార్ జైల్లో ఉన్న చిదంబరం
  • జైల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన భోజనం ఉండదు
  • అందరికీ ఒకే రకమైన భోజనం ఉంటుందని వ్యాఖ్య

ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చిదంబరానికి ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతించాలని ఆయన తరపు లాయర్, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ ఢిల్లీ హైకోర్టును కోర్టును కోరారు. ఈ విన్నపాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే కైత్ తిరస్కరించారు. జైల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన భోజనం ఉండదని... అందరికీ ఒకే రకమైన భోజనం ఉంటుందని చెప్పారు. మరోవైపు, ఐఎన్ఎక్స్ కేసులో ఈడీ ముందు లొంగిపోయేందుకు అనుమతించాలంటూ చిదంబరం వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.

Chidambaram
INX Media
Congress
Kapil Sibal
  • Loading...

More Telugu News