Andhra Pradesh: ఏపీ మంత్రి మోపిదేవి ఢిల్లీ టూర్.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తో భేటీ!

  • ఈరోజు ఢిల్లీకి చేరుకున్న మోపిదేవి
  • ఏపీ మత్స్య పరిశ్రమ వృద్ధికి సాయం చేయాలని వినతి
  • సానుకూలంగా స్పందించిన గిరిరాజ్ సింగ్

ఆంధ్రప్రదేశ్ పశుసంవర్థక, మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం కేంద్ర డెయిరీ, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలనీ, ఇతోధికంగా సాయం చేయాలని కోరారు. ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని మోపిదేవి గిరిరాజ్ సింగ్ కు అందజేశారు. విశాఖ హార్బర్ ను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన గిరిరాజ్ సింగ్.. ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను పరిశీలించి కావాల్సిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Andhra Pradesh
Mopidevi venkataramana
giriraj singh
New Delhi
meet
  • Loading...

More Telugu News