Telangana: పోలీసుల ముందే మహిళ ‘టిక్ టాక్’ చిందులు.. ఎంజాయ్ చేసిన రాచకొండ పోలీసులు!

  • హైదరాబాద్ లోని రాచకొండలో ఘటన
  • టిక్ టాక్ వీడియో పాటలకు డ్యాన్స్
  • సదరు మహిళను ఆపని పోలీసులు

సోషల్ మీడియా యాప్ ‘టిక్ టాక్’ కారణంగా ఇటీవల తెలంగాణలో పలువురు వైద్య సిబ్బంది చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. వీడియోను రికార్డు చేసే సౌకర్యమున్న ఈ యాప్ కారణంగా లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది. తాజాగా హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జన శోభాయాత్రల సందర్భంగా రాచకొండ వద్ద ఓ మహిళ హల్ చల్ చేసింది. ఏ మాత్రం భయంబెరుకూ లేకుండా పోలీసుల మధ్యలోకి వెళ్లి టిక్ టాక్ వీడియోలోని పాటలకు గెంతడం మొదలుపెట్టింది.

ఆమెను వారించని రాచకొండ పోలీసులు, పక్కన నిలబడి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఒక్కచోట కాకుండా పోలీసులు ఉన్న చాలాచోట్లకు వెళ్లిన సదరు మహిళ, చిందులు వేయడం మొదలుపెట్టింది. అయితే ఆమె ఎవరో, ఎందుకు ఈ పనిచేసిందో వివరాలు తెలియరాలేదు. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది..

Telangana
Tiktok
video before polece
Dance
Hyderabad
Rachakonda
  • Error fetching data: Network response was not ok

More Telugu News