Tollywood: విజయ్ దేవరకొండ బాటలో సాయిధరమ్ తేజ్.. ‘సేవ్ నల్లమల’ ఉద్యమానికి మద్దతు!

  • ఎక్కడో ఉన్న అమెజాన్ కార్చిచ్చు గురించి బాధపడ్డాం
  • మరి మనం ఇక్కడ చేస్తున్నది ఏంటి?
  • రండి.. మన ప్రకృతిని కాపాడుకుందాం

తెలంగాణలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రూపుదిద్దుకుంటోంది. యురేనియం తవ్వకాన్ని ఒప్పుకోబోమని కాంగ్రెస్, వామపక్షాలు, తెలంగాణ జనసమితి, జనసేన పార్టీలు ఇప్పటికే ప్రకటించగా, ప్రస్తుతం సినీపరిశ్రమ నుంచి ఇందుకు మద్దతు లభిస్తోంది. నటులు విజయ్ దేవరకొండ యురేనియం తవ్వకం విషయమై ఘాటు వ్యాఖ్యలు చేయగా, తాజాగా మెగాహీరో సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో స్పందించారు.

‘ఎక్కడో ఉన్న అమెజాన్ అడవులు కాలిపోతుంటే మనం బాధపడ్డాం. మరి మనం ఇప్పుడేం చేస్తున్నాం? రండి.. మన ప్రకృతిని కాపాడుకుందాం. సేవ్ నల్లమల’ అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాలో నటిస్తున్నారు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.

Tollywood
Sai dharamtej
Save nallamalla
Support
Andhra Pradesh
Telangana
Uranium mining
  • Loading...

More Telugu News