Telugudesam: టీడీపీ నేతలపై ఎస్సీ, మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేశాను: వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

  • కుల వివక్ష చూపిన వారిపై కేసులు నమోదు చేయాలి
  • నిందితులందరికీ శిక్షలు పడే వరకూ పోరాడతా
  • టీడీపీ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారు

ఇటీవల తనను కులం పేరిట దూషించిన టీడీపీ నేతలపై ఢిల్లీలోని ఎస్సీ, మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేశానని తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, కుల వివక్ష ప్రదర్శించిన వారిపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని కోరినట్టు చెప్పారు. ఈ కేసులో నిందితులందరికీ శిక్షలు పడే వరకూ పోరాడతానని అన్నారు. టీడీపీ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని, కులవివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడుపై ఆమె విమర్శలు గుప్పించారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చంద్రబాబు పరిగణించారని విమర్శించిన శ్రీదేవి, అదే దళితులను పల్లకీలో కూర్చోబెట్టి మోస్తున్నారని సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు.

Telugudesam
Chandrababu
YSRCP
mla
sridevi
  • Loading...

More Telugu News