MS Dhoni: ధోనీ రిటైర్మెంట్ వార్తలకు తెరదించిన సాక్షి!

  • దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ కు ధోనీని ఎంపిక చేయని సెలెక్టర్లు
  • రిటైర్మెంటే తరువాయి అంటూ కథనాలు
  • పుకార్లేనంటూ కొట్టిపారేసిన ధోనీ భార్య

దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ కు ధోనీని ఎంపిక చేయకపోవడంతో ఇక ఆ దిగ్గజం క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడంటూ కథనాలు వెల్లువెత్తాయి. ధోనీ కూడా ఏమీ స్పందించకపోవడంతో రిటైర్మెంట్ పై అనిశ్చితి ఏర్పడింది. ఈ సందిగ్ధ పరిస్థితికి ధోనీ అర్ధాంగి సాక్షి తెరదించింది. ఏకవాక్యంతో స్పష్టతనిచ్చింది. ట్విట్టర్ లో ప్రత్యేకంగా ఇదీ విషయం అని పేర్కొనకపోయినా సాక్షి చేసిన సింగిల్ లైన్ ట్వీట్ తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. "మరి, వీటినే పుకార్లు అంటారు!" అంటూ సాక్షి ట్వీట్ చేసింది. ఆ చిన్న ట్వీట్ ధోనీ అభిమానుల్లో ఎంత సంతోషం నింపిందో చెప్పాలంటే ఆ ట్వీట్ కు వచ్చిన రీట్వీట్లు (6 వేలు), లైకులు (17.9 వేలు) చూడాల్సిందే!

MS Dhoni
Sakshi Singh
India
Cricket
  • Error fetching data: Network response was not ok

More Telugu News