Telangana: వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

  • జంట నగరాల్లో 35 వేల మంది సిబ్బందితో బందోబస్తు
  • కమిషనరేట్ ల పరిధిలో 5 లక్షల సీసీ కెమెరాలు
  • కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ

ప్రజల సహకారంతో వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. జంట నగరాల్లో  35 వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని, మూడు కమిషనరేట్ ల పరిధిలో 5 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిమజ్జనాలు  ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నట్టు తెలిపారు.

కాగా, భక్తుల కోలాహలం మధ్య గణపతి విగ్రహాలు గంగమ్మఒడికి చేరుతున్నాయి. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, సరూర్ నగర్ చెరువు, మీరాలం ట్యాంక్, దుర్గం చెరువు ప్రాంతాల్లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. రేపు మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగనున్నాయి.
 

Telangana
Hyderabad
secunderabad
Dgp
  • Loading...

More Telugu News